Search for products..

Home / Categories / Personality Development /

ఆనందంగా జీవించడానికి కొన్ని సూచనలు - సలహాలు - Anandamga Jeevinchadaniki Konni Suchanalu - Salahalu

ఆనందంగా జీవించడానికి కొన్ని సూచనలు - సలహాలు - Anandamga Jeevinchadaniki Konni Suchanalu - Salahalu




Product details

ముందుమాట
మన జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. 35, 40 సంవత్సరాలు కష్టపడి పనిచేసి మనం పనికి విశ్రాంతి సమయం వచ్చిన తరువాత ఆనందించవలసిన సమయం.
బ్రతికినంతకాలం ఆనందంగా జీవించడం ఎలా అన్నది చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది. కొంతమంది సరిగా అవగాహన లేక ఆలోచన చేయక శేష జీవితాన్ని సరైన ముందుచూపు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలవుతారు.
మనం వ్యాపారం, ఏదో ఒక వృత్తిపని గాని చేసినపుడు ఉన్న గౌరవం అదే విధంగా ఉండాలని ఆశించడం మంచిదికాదు. అదే జీవనం పొందాలనుకోవడం కూడా సరికాదు. మనకు మన పని నుండి విశ్రాంతి వచ్చిన తరువాత కొన్ని నియమాలు పాటిస్తే శేష జీవితాన్ని ఆనందంగా అందరికీ ఉపయోగపడుతూ, ప్రశాంతంగా జీవించవచ్చు.
ప్రశాంతంగా జీవించటం అత్యధికభాగం మన చేతుల్లో, మనసుల్లో, మనపనిలో ఉంటుంది. అందుకు కొన్ని పనులు చేయాలి. మన ప్రవర్తన అన్నింటికంటే ముఖ్యం. మన పనిని ప్రవర్తనను బేరీజు వేసుకుంటూ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధుమిత్రులకు మన చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించకుండా సహాయంగా ఉంటూ జీవించడం ముఖ్యం. అప్పుడే శేష జీవితం ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడే మనం, మన చుట్టుపక్కల వాళ్లు ఆనందంగా సమస్యలు లేకుండా ఉండగలరు.
గతంలో చేసిన తప్పులను తలచుకుంటూ చింతించేకంటే, ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవడం ఉత్తమం. కుటుంబ సభ్యులు, బంధువుల, స్నేహితులతో వ్యవహరించే తీరులో ఎప్పటికప్పుడు పరిపక్వత చూపించండి. కోపం, భయం, విచారం వంటి ప్రతికూల భావాలను పశ్చాత్తాపపడటం అత్యంత ప్రయోజనకరం.
ఈ పుస్తకం రూపకల్పనకు సహకరించిన మిత్రులు సి.వి. కృష్ణయ్య, డా. రావెళ్ళ శ్రీనివాసరావు గార్ల కృషిని మరువలేను. అనుకోకుండా.. ఆఖరి నిమిషంలో (తనకు తానుగా) అందుబాటులోకొచ్చి ఎడిట్ చేసిన సీనియర్ పాత్రికేయులు (క్వాలిటీ సెల్) జి.వి.రంగారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ పుస్తకం తొందరగా తేవాలనే ఆతృత వలన సమయాభావం వలన లోపాలు జరిగి ఉంటే క్షమించగలరు. మలి వయసు వారు ఆనందంగా గడపడానికి కొంతవరకు అయినా ఈ పుస్తకం ఉపయోగపడుతుందని నా ఆశ.
ఈ పుస్తకాన్ని కృష్ణా (ఉమ్మడి) జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 25వ వసంతాల మహోత్సవాల సందర్భంగా తెస్తున్నాం.
డిసెంబరు 22, 2024
-దేవినేని మధుసూదన రావు
చైర్మన్
దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్.


Similar products


Home

Cart

Account