Menu

Vanguri Foundation of America

Vanguri Foundation of America

America Telugu Kathanika Eight Volume

Quantity

Product details

తెలుగులో కవితలు, కథలు, వ్యాసాలు వ్రాసి ప్రచురించుకున్న అమెరికాలో ఉన్న తెలుగు వారి సంఖ్య సుమారు నాలుగు వందలు అని అంచనా. వీరు జీవితావసరాలకి జీతాలు, భత్యాలు గడించడం కోసం వ్రాయటం లేదు. అభిమానం, మమకారం, సంతృప్తి, రసానుభూతి, సాహసాలతో కూడిన వ్యాసంగం వీరిది. వీరిని ప్రోత్సహించవలసిన విధి మనందరిది.

ఈ కథానికల సంకలనంలో ఇరవై తొమ్మిది కథలున్నాయి. ఇక్కడి తెలుగువారి జీవిత సమస్యల గురించి కొన్ని, మాతృదేశంలో పరిస్థితుల గురించి కొన్ని, మన పురాణేతిహాసాలకి సంబంధించినవి కొన్ని రకరకాల కథావస్తువులని పరిచయం చేసే రచనలతో కూడిన సంచిక ఇది. కొన్ని కథారచన పోటీలలో బహుమతులను పొందినవి. ‘‘ఇమిగ్రంట్ తెలుగు ఇంటలెక్టుయల్’’ మనస్తత్వానికి ఒకరకంగా అద్దం లాంటివి. ఈ రచయితలని అభినందిస్తూ ప్రోత్సహించాలి మనం అంటే పాఠకులూ, పబ్లిషర్లూ అందరూ కూడా.

అట్లాంటా,

సెప్టెంబర్ 1, 2004        

-పెమ్మరాజు వేణుగోపాలరావు

You may also like

Search
Home
Shop
Bag
Account