America Telugu Kathanika Fifth Volume
Product details
సంపాదకీయం
- పెమ్మరాజు వేణుగోపాలరావు
కథాకల్పన ఈనాటి కొత్తవిద్యకాదు. అనాదినుంచి, ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుని స్మరించుకోగలిగిన నాటినుంచి మనిషికి సహజంగా అబ్బిన విద్య.
మనస్సుని తాను కట్టుబాటులో పెట్టుకోవడమే కాకుండా, ఇతర మనస్సులపై కూడా తన ఆలోచనల ప్రభావాన్ని ప్రసరింప చేయగల శక్తి ప్రతిమనిషికి కొద్దోగొప్పో ఉంటుంది. మనం నేర్చిన కళలు, కవితలు, కల్పనలు - ఈ ప్రభావాన్ని సద్వినియోగం చెయ్యటానికే.
కథాకల్పన ఒక కళ. ఇది పోషించే వ్యవస్థలు, ఉపాసనచేసే కథకులు, అనుభవించే రసికులు అందరూ ప్రతి సంఘానికి అవసరం. నాగరికతకి దర్పణం ఈ కళల మనుగడ.
ఉత్తర అమెరికా ఆంధ్రుల కథాకల్పనా కుతూహలానికి ఈ సంకలనం ఒక సూచిక. ఈ సంవత్సరం వంగూరి ఫౌండేషన్‌కి పంపిన కథలలో ఎన్నుకొన్న కొన్ని కథల సంకలనమిది. ఈ సంవత్సరం కథానిక పోటీలో ప్రథమ బహుమతి నందుకున్న కథ అదృష్టవంతుడు. రెండవ బహుమతి నందుకున్నవి రెండు కథలు - ఆలంబన, హుండీ.
వీటితో పాటు తెలుగుజ్యోతిలో వేమూరి వేంకట రామనాథంగారు ప్రచురించిన ‘కథాకల్పన’ అనే వ్యాసం కూడా జతపర్చాం. అందరికి తెలిసిన శ్రీనివాసకళ్యాణంలో కల్పన-కథన-ఔచిత్యాలు వివరించారు ఈ వ్యాసంలో. రచయితలు, రసికులు గమనించవలసిన విషయాలున్నాయి ఇందులో.