Menu

Vanguri Foundation of America

Vanguri Foundation of America

America Telugu Kathanika First Volume

Quantity

Product details

కేవలం కల్పితమయిన కథలుకూడా ఉన్నాయి- స్వర్గారోహణం, యాదృచ్చికం, ఆవగింజ అంతర్యం, గిరీశం ఇన్ వైట్ హౌస్, నిన్ను నీవు మరువకుము, కటిక చీకట్లో కాంతి వర్షం.

ఈ సంకలనం ఎందుకు? అని ఎవరయినా ప్రశ్నిస్తే చెప్పే సమాధానం ‘ఇది మన సొత్తు’. మన మాతృభాషలో మనకున్న పరిచయాన్ని పోగొట్టుకోకుండా, మన ఆలోచనలని, మన సమస్యలని, మన అనుభవాలని ఆ భాషలో పదిల పరచటానికి ప్రయత్నిస్తున్న వారందరినీ ప్రోత్సహించటానికి, మనలో ఉన్న సాహిత్యాభిమానం సృజనాత్మక శక్తిగా అవతరించే అవకాశాలు కల్పించటానికి.

ఇతర ప్రక్రియలతోబాటు ఈ రచనల రూపకంగా కూడా ప్రవాసాంధ్రుల సమస్యలు, సంతృప్తులు అందరికి తెలుస్తాయి గదా!

ఈ రచయితలలో అందరూ తెలుగు భాషా పండితులు కారు. కాని వీరు తమభావాలని తాము వాడుకునే, వాడగలిగే భాషలో వ్రాయగలిగిన వారు. ఈ రచనల్లో గ్రాంథిక భాష ఉంది, వ్యావహరిక భాష ఉంది. తెలుగుతో పరిచయం సన్నగిలడంవల్ల అలవాటయిన పరభాషా సమన్వితమయిన భాష ‘మహాంధ్రం’లో కూడా వ్రాయబడింది. భావ ప్రకటనే ప్రధానంగా వ్రాయబడిన ధోరణి, శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి ఈ కథల్లో.

కథలు వ్రాయటం, కథలు ప్రచురించటం, కథలు చదవటం అమెరికా ఆంధ్రుల నిత్య జీవితంలో మామూలైనప్పుడు అమెరికాలో కూడా తెలుగు భాష జీవిస్తోందని చెప్పుకోవచ్చును.

పెమ్మరాజు వేణుగోపాలరావు

సంపాదకుడు

అట్లాంటా, జార్జియా

జాన్ 18, 1995

You may also like

Search
Home
Shop
Bag
Account