Menu

Vanguri Foundation of America

Vanguri Foundation of America

America Telugu Kathanika Fourth Volume

Quantity

Product details

అమెరికా ఆంధ్రుల జీవితంలో తటస్థపడే సమస్యలపై సగం కథలున్నాయి. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో తల్లిదండ్రులూ, పిల్లలూ ఎదుర్కొనే సమస్యలగురించి ‘సంఘర్షణ’, ‘మొగుడు కావాలా!’ అనే కథలలో విచారణ జరగింది. దాంపత్యజీవితంలో కలిగే ఒడుదుడుకులు, వైరాగ్యాల గురించి నాలుగు కథలున్నాయి- ‘పెళ్ళి’, ‘జీవనవాహిని’, ‘సర్‌ప్రైజ్’, ‘అకాలవసంతం’. పిల్లల పెంపకం గురించి కథ - ‘మూతికాలిన పిల్లి’.

అమెరికా వచ్చినా పాత అలవాట్లు, మనస్తత్వాలు మారని మనుష్యులున్నారని చెప్పటానికి వ్రాసిన రచన ‘అలవాటు’.

వివాహం తమ జీవితాలని ఎటువంటి అనుకోని మార్గాలకి మళ్ళిస్తుందో గ్రహించి బాధ్యతతో ప్రవర్తిస్తున్న రెండు స్త్రీ పాత్రల జీవితాలలో ఘట్టాలు ప్రాతిపదికగా చేసుకుని వ్రాసిన కథలు - ‘మంచికాలం ముందు ముందు’,’ ద్వైతం’.

మీసాల తాతయ్య, వెట్టివాడు లాంటి పాత్రలని చిత్రించటానికి వ్రాసిన స్కెచ్లు-’మామిడిపండు’, ‘ఏంకథవ్రాయాలి’.

చిన్నతనపు మనస్సులు నీతి నిజాయితీల గురించి మధనపడే అవకాశాలు కల్పించే పరిస్థితులు కథగా రూపొందిచబడ్డాయి ‘సజ్జనులు’ అనే కథలో.

శాస్త్రీయవిశేషాలని దృష్టిలో పెట్టుకుని అతి జాగ్రత్తగా విషయవిశ్లేషణ జరుపుతూ తెలుగువారి జీవితాల్లో సాధారణమైన ఘట్టం ఒకటి కథగా అల్లిన కథ ‘భూతవైద్యం’.

కథావిధానంలోను, కథా వస్తుసేకరణ లోనూ, - అన్ని విధాలా నిపుణతతో వ్రాయబడిన రచనలు పోటీలో బహుమతి పొందిన కథలు రెండు- ‘తెమీనచా నమీనచా’, ‘ఓరి భగవంతుడా, యిప్పుడేందారి?’.

కథలపోటీ పేరుతో మంచి కథలు వ్రాసి పంపిన రచయితలందరూ అమెరికా ఆంధ్రుల సాహిత్య హోమానికి సమిధలు అర్పిస్తున్న యోగ్యులే. ఈ హోమం నిరాఘాటంగా జరిగినప్పుడే మనందరికి తృప్తి. దీనికి రచయితలు, పబ్లిషర్లు, పాఠకులు అందరి సహకారం కావాలి.  - పెమ్మరాజు వేణుగోపాలరావు

 

You may also like

Search
Home
Shop
Bag
Account