America Telugu Kavitha First Volume
Product details
వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కవితల పోటీ జరపటం ప్రారంభం అయిన నాటినుంచి ఉత్తర అమెరికాలోని తెలుగు రచయితలు పంపిన కవితలలో మచ్చుతునకలివి. అంటే గత మూడు సంవత్సారాలలో అమెరికా ప్రవాసాంద్రుల మనస్సులలో మొలకలెత్తిన కొన్ని భావాలకి ఇవి ప్రతి రూపాలు.
ఆధ్యాత్మికమైనవి, ఆత్మాశ్రయమయినవి, ప్రకృతిని దర్శించి పరిశీలించినవి. పండుగలను స్మరించుకునేవి, భారతీయతని గుర్తు తెచ్చుకునేవి, శృంగార రసభావనలతో తన్మయత కలిగించేవి. ప్రవాసాంధ్రుల జీవితాశయాలను విమర్శించేవి - విభిన్న రీతులలో వీరి కవిత్వాలు సాగాయి.
‘నాలోని వెలుగంత నీవలన కలుగు’ నని పరమాత్మను సంబోధించిన కవితకు, ఆ పరమాత్మనే ‘అందల మెక్కించిన ఒక అభూత కల్పన’ గా వర్ణించిన కవితకు తేడా మానవుల మనస్సులలో ఉన్న విభిన్న దృక్పథాల వ్యత్యాసమే ఈ రెండు కవితల సృష్టించిన మనస్సులు ఒక జాతికి చెందినవే.
ఒకరు ‘హృదయ సింహాసనమునే అధిష్టించి ఉన్న ఆ దేవుణ్ణి’ అర్చించమన్నారు. ‘తెలియని సృష్టిచేసి’ ఎక్కడున్నావని ఎదురు ప్రశ్నవేశారు దేవుణ్ణి మరొకరు. ‘నాకు నాల్గవ జీవితం ఇస్తే నీకు పోటీగా మళ్ళీ సృష్టి చేస్తానని బ్రహ్మగారిని బెదిరించిన కవి ఒకరు. బ్రహ్మకన్న అమ్మేగొప్ప అని ప్రకటించి బ్రహ్మగారిని చిన్నబుచ్చిన కవి ఒకరు. పలురకాలుగా ఆధ్యాత్మిక చింతన ఈ కవితలలో నడిచింది.
‘హితులకు జీవనదిగా దైవతత్వం మూర్తిగా నిలిచే ప్రాణి’ అని తన జీవితాన్ని నిర్వచించుకున్న కవి ఒకరు. ‘మనం ఎందుకు పుట్టామో, పుట్టి ఏం ఉద్ధరించామో ఎన్నడూ తెలుసుకోలేం!’ - అనే నిరాశావాది ఒకరు. ‘ఒంటరితనం’ మనస్తాపానికి ఉపశమనంగా వాడుకోమని సలహా ఇచ్చిన కవి ఒకరు. ‘హృదయానందం పొంగ’ టానికి అవకాశాలు చూపించిన కవి మరొకరు. ‘కాలం ఆగదు’, స్నేహం అనుక్షణం స్మరించుకోవలసిన సంస్కృతి మనదని జ్ఞాపకం చేసిన కవి ఇంకొకరు. ‘ఈనాడే నీదిగా, నీతిగా బ్రతికితే’ జాతిని నిలపగలమని హెచ్చరించిన కవిత ఒకటి.
ఇక ప్రవాసాంధ్రులగురించి అన్నిరకాల ఆలోచనలూ మనల్ని బాధిస్తున్నాయి. ‘మెట్టినింటిని పుట్టినింటిని మర్చిపోలేని అమెరికా ప్రవాసాంధ్రులు’ పడుతున్న మనఃసంక్షోభాలు మచ్చుకి కొన్ని గమనించండి: