Menu

Vanguri Foundation of America

Vanguri Foundation of America

అమెరికామెడీ నాటికలు (AMERIKAAMEDY NAATIKALU)

Quantity

Product details

నా ఈ నాటక జీవితంలో నన్ను ఎంతో అభిమానంతో ఆదరించి, నాకూ, ప్రేక్షకులకీ అఖండమైన ఆనందాన్ని కలిగించిన నటీనటులకీ, దర్శకులకీ, నిర్వాహకులకీ సముచిత స్థాయిలో ప్రగాఢమైన కృతజ్ఞతలు తెలుపుకునే తెలుగు భాష నాకు రాదు. శ్రీశ్రీగారు తన ముందుమాటలో చెప్పినట్టుగా ‘‘ఏ నాటకానికైనా రంస్థలం మీదనే ప్రాణం రావాలి’’. ఆ ప్రాణం పోసేవారు కేవలం ప్రేక్షకులే. నా పూర్వ జన్మ సుకృతం వలన ఎవరు, ఎక్కడ ప్రదర్శించినా, నా నాటకాలకి ప్రాణం పోసిన కొన్ని వేలమంది ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు తెలుపుకునే తెలుగు భాష కూడా నాకు రాదు. అందుకే నా నాటకాలని చూసి మెచ్చుకుంటూ, (కొండొకచో మెచ్చుకోకుండా కూడా) సహృదయులైన ప్రేక్షక మహాశయులకి, వారు కొట్టిన తప్పట్లు రెట్టింపు చేసి అందరికీ మనసారా హర్షధ్వానాలు చేస్తున్నాను.

ఈ సంకలనానికి ముందుమాటలు రాసిన గొల్లపూడి మారుతీరావుగారు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు, పెమ్మరాజు వేణుగోపాలరావుగారు తెలుగు నాటకరంగంలో అద్వితీయులు. నాకు ఆత్మీయులు. ఈ పుస్తకాన్ని ఎప్పటిలాగానే మనసు పెట్టి రూపకల్పన చేసి ప్రచురించిన చిరకాల మిత్రులు రచనశాయిగారు (హైదరాబాదు), బాజ్జీ రావు మరియు ఝాన్సీగారు, (హ్యూస్టన్) అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నన్ను ‘‘చేసుకున్నప్పటినించీ’’ నా అన్ని రకాల వేషాలనీ ‘‘భరిస్తూ’’, అప్పుడప్పుడు తను కూడా నా నాటికలలో ‘‘మంచి’’ వేషాలు వేస్తున్న నా better half.... లక్ష్మీ గిరిజా కుమారికీ, మా పిల్లలు అపూర్వ, అమూల్య, అనుజ్ శర్మలకీ నా ప్రేమాభిమానాలు.

 

హ్యూస్టన్, టెక్సస్                                                                                                  -వంగూరి చిట్టెన్ రాజు

25 14, 2008

You may also like

Search
Home
Shop
Bag
Account