ARUNA KIRANALU - DR. P.V. ARUNACHALAM
Product details
‘‘అరుణ కిరణాలు’’ స్వయంగా ముద్రించాలన్న నిర్ణయంతో తెలుగు విశ్వవిద్యాలయం వారికి ఆర్ధిక సహకారం కోసం అర్జీ పెట్టుకున్నాం, వారి సమ్మతి లభించింది. దురదృష్టవశాత్తు మేము పుస్తకం ముద్రణకై ఇచ్చిన కీర్తిప్రింటర్సు మూతపడింది. ఆ అచ్చు ప్రతి ప్రింటర్సు యజమాని ఆచార్య అరుణాచలం గారికి పుస్తకం అప్పజెప్పి వెళ్లిపోయారు. పనుల ఒత్తిడిలో అరుణాచలం గారు ఆ విషయం మరచిపోయి పుస్తకం నా దగ్గరే వుందన్న దురభిప్రాయంలో వుండిపోయారు.
సార్ ఇంటికి పెయింట్ వేసే సందర్భంలో అటకల మీద కాగితాల కట్టల సరంజామాలోంచి ఈ పుస్తకం బైటపడ్డది. అరుణాచలం గారి మనస్సులోని అపోహలు తొలగి ‘‘పుస్తకం దొరికిందమ్మ పంపుతాను. ద్రావిడ విశ్వవిద్యాయలం ద్వారా ముద్రించే అవకాశం వుందేమో చూడమని చెప్పారు.’’ 1998లో పూజారి వెంకటేష్ అనే విద్యార్థికి ‘అరుణకిరణాలు’ ప్రెస్‌కి ప్రింటింగ్ ఇచ్చాము. తొందర్లో ప్రింటు అవుతుంది. ఈ లోపల నీ పరిశోధన కొనసాగించమని చెప్పడం, ఆ విద్యార్థి ఎంతో నేర్పుగా సకాలంలో పరిశోధన పూర్తి చేయడం జరిగింది. ఆ పరిశోధన వ్యాసాన్ని చూసి అరుణాచలంగారు ఎంత శ్రమ పడ్డావమ్మ నన్నోక సాహితీమూర్తిగా నిలబెట్టడానికి’ అని మెచ్చుకోవడం నాకు లభించిన, నేనెప్పటికీ మరిచిపోని అభినందనలు.
సకాలంలో పుస్తకం అందించలేని కారణంగా తెలుగు విశ్వవిద్యాలయం నుండి మంజూరు అయిన ఆర్థిక సహాకారం రాలేదు. అరుణాచలం గారి కోరిక మేరకు పట్టు వదలని విక్రమార్కుడిలా ద్రావిడ విశ్వవిద్యాలయం వారికి ముద్రణ కోసం ఏడెనిమిది సంవత్సరాల క్రితం అర్ధించాను. ఇదుగో అదుగో చేస్తాం అంటూ ముగ్గురు రిజిష్టార్లు, ముగ్గురు వైన్ చాన్సలర్లు మారారు. పని జరగలేదు. అది ఇంతకు ముందే ముద్రించబడిందని ఒక అపవాదు, మరోసారి పక్కన పెట్టివుంది అనీ, మరోసారి ఫండ్స్ లేవని ఎన్నో సాకులు, అడ్డంకులు ఎదుర్కొన్నదీ ‘అరుణకిరణాలు’’.