Search for products..

Home / Categories / Literature /

బాలబంధు - 2 (Balabandhu - 2) - బి.వి. నరసింహరావు (B.V. Narasimharao)

బాలబంధు - 2 (Balabandhu - 2) - బి.వి. నరసింహరావు (B.V. Narasimharao)




Product details

బాలసాహిత్యంలో బి.వి. చేసిన పని భావితరాలకు అందచేయాలని దాని ద్వారా బాలలలో సాహిత్యం పట్ల అభిలాష కలగచేయాలని నా సంకల్పం, బి.వి.కి పిల్లలంటే ఎంతో ఇష్టం. వారి కొరకు వేషాలు వెయ్యటం, చక్కని సులభశైలిలో గేయాలు, కథలు రాయటం తెలుగు బాలల అదృష్టం.

జీవితమంతా పిల్లల ముందు ఆడుతూ, పాడుతూ ప్రదర్శనలు ఇస్తూ బాలసాహిత్య ప్రయోక్తగా బి.వి. ఎంతో పేరు పొందారు.

·         రెండవ భాగము: కథలు, గేయాలు, గేయ నాటికలు

పిల్లలే కాదు అన్ని వయస్సుల వారిలో కథల మొక్కలను నాటటం, అలాగే సుందరమైన, ఆహ్లాదకరమైన, పులకించే పాటల పూలను పూయించటం బి.వి. గారికి అలవాటు. పిల్లలను నవ్వించడం, ఆలోచింపచేయడం, వారి భాషలో చెప్పటం బి.వి.కి కరతలామలకం, ఎవ్వరింటికైనా వెళ్ళటం, వారితో కలిసిపోవటం, వారికి ఇష్టమైన వంటకాలను వండించుకుని తృప్తిగా భుజించడం వారికి ఇష్టం.


Similar products


Home

Cart

Account