Product details
భూమిక - సంగ్రామ్
ఆధునిక కథ సమకాలీన జీవితాన్ని చిత్రిస్తుంది. ఈ ‘భూమికోసం కథలు' జాస్తి పుల్లయ్య ఉరఫ్ సంగ్రామ్ రాసినవి. ఇవి అనగా అనగా కథలు కావు. కబుర్లు అంతకంటే కావు, కాలక్షేపం బఠానీలు అసలే కావు. వీటిని జీవిత శకలాలు అనవచ్చు. సూర్యుడిచుట్టూ భూమి తిరిగినట్లు భూమిచుట్టూ సాహిత్యం తిరుగుతుంది.
సంగ్రామ్ కథలన్నీ వీటికి తార్కాణాలుగా కనిపిస్తాయి. ఏ చైతన్యం అయినా జీవితం నుంచే రావాలి. జీవితం మీద ఆసక్తి, వాస్తవికత మీద పట్టు లేకపోతే సంగ్రామ్ కలం నుంచి ఈ కథలు వెలువడేవి కావు. ఈ కథలు చదివితే, కథలు రాయడం కష్టమనేది ఎంత తెలివి తక్కువతనమో అర్థమవుతుంది. కొత్తగా కథలు రాసేవాళ్లు సంగ్రామ్ నుంచి ఊపును, ఉత్సాహాన్ని అందిపుచ్చు కోవచ్చు.
Similar products