Product details
చెరుకూరి వీరయ్య :
వేమన అడుగుజాడలో సామాజిక స్పృహతో, చదువుకోటానికి, చదవడానికి వీలుగా, చిన్న చిన్న పదాలనే
పద్యాలలో వాడాను. నా కవితకు ఊపిరి ప్రేరణ. ‘మనిషే’ ఇంకేం? వస్తుపరంగా కావలసినంత సరుకు
లభ్యమయింది. ‘ఉన్నమాట వీరయన్నమాట’ అనే మకుటాన్ని నా పద్యాలకు తగిలించటంలో నా ఉద్దేశం
ఏమిటో విశద పరచాలి.
స్నేహం చేస్తే ప్రాణమిస్తాడు, విరోధిస్తే ప్రాణం తీస్తాడు. ఇదే మనిషిలోని మానవ ద్వంద్వ ప్రవృత్తి. ఆ
ద్వంద్వ ప్రవృత్తినే నా కవితలలో విశదపరచటానికి ప్రయత్నించాను. సరే! ఇక నా కవితల్ని చదవండి.
ఒకటికి రెండు సార్లు చదివి విశ్లేషించండి! విమర్శించండి! సద్విమర్శ కృతికి సమకూర్చు ఖ్యాతిని-అని
విశ్వసించిన నాకు నా కవితలోని మంచి చెడులను తెలియజేయండి!
Similar products