Search for products..

Home / Categories / Literature /

చెరుకూరి జలభారతం

చెరుకూరి జలభారతం




Product details

             మనముపయోగిస్తున్ననీటిలో సింహభాగం (83 శాతం) వ్యవసాయానికి సాగునీటి రూపంలో వినియోగిస్తున్నాం. కాని, సాగునీటి వినియోగ సామర్థ్యం (Water- Use Efficiency) కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో 50-60 శాతం వరకు వుండగా, మనదేశంలో మాత్రం 30-35. శాతానికి మించి యుండటం లేదు.

సాగునీటి వ్యవస్థ నిర్వహణ కేవలం సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు. సామాజిక ప్రక్రియ కూడా.

        వివిధ పంటలకు, వివిధ దశలలో అవసరమైన నీటి పరిమాణాన్ని లెక్కగట్టి, ఆయకట్టు కంతటికీ న్యాయోచితంగా పంపిణీ జేసే కార్యవర్తన ప్రణాళిక (Operation Plan), కాలువలను, కట్టడాలను ఆరోగ్యకరమైన స్థితిలో వుంచటానికి అవసరమైన 'పోషణ ప్రణాళిక (Maintenance Plan), నీటిని పొదుపుగా వాడుకొని అధికోత్పత్తిని సాధించటానికి అనుగుణమైన 'సూక్ష్మసేద్య విధానాలు (Micro Irrigation Systems). చెరువులు - వాటి రక్షణ, తక్కువ నీటితో అధికోత్పత్తిని సాధించగలిగే 'శ్రీ' వరిసాగు విధానం' (System of Rice Intensification -SRI), మొదలగు ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో చేర్చబడినవి. సామాన్య రైతుకు కూడా అర్ధమయ్యే రీతిలో సులభశైలిలో ఈ పుస్తకం రచించబడింది.

         రైతులు, సాగునీటి వినియోగదారుల సంఘాల వివిధ కార్యక్రమాలలో యాజమాన్య స్పృహతో చురుకుగా పాల్గొని, పొదుపుగా నీటిని వాడుకొని, అధిక వ్యవసాయోత్పత్తులను సాధించగలిగినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. రైతులు సుఖ, సంతోషాలతో మనగలుగుతారు.

 


Similar products


Home

Cart

Account