Øచెరుకూరి వీరయ్య సివిల్ ఇంజనీరింగ్ ( బి.ఇ ) పట్టా స్వీకృతి
Ø1989 సంవత్సరపు ఉత్తమ ఇంజనీరు పురస్కార స్వీకృతి.
Ø1996 – 97 లో రాష్ర్టప్రభుత్వానికి నీటిపారుదల రంగంలో సంప్రదింపు నిపుణుడుగావిధి నిర్వహణ చేశారు.
Øవృతిపరంగా ఇంజనీరైనా, ప్రవృతిపరంగా సాహితీవేత్త, కవి, రచయిత, వ్యాసకర్త.
చెరుకూరి వీరయ్య రచయిత. ఈయన రైతు కుటుంబం లోంచి బయటికొచ్చి సేద్యపు నీటి శాఖలో పెద్ద ఇంజనీరుగా పనిచేసి, అన్నదాతలతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, దశాబ్దాలపాటు వాళ్ళ సమస్యల్నీ, సంతోషాల్ని, కష్టాల్ని, కలల్నీ, బాగా అర్థం చేసుకొన్నవారు. అందువల్లనే ఆయన కవిత్వంలో మామూలు సమస్యలు, మామూలు మాటలు, హాస్యాలు, అపహాస్యాలూ వినిపిస్తాయి. ఉరుములు వినిపించవు.