Menu

Dr. Y. Mallikarjuna Rao Books

Dr. Y. Mallikarjuna Rao Books

దైవం - డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు

Quantity

Product details

మనకు ముక్కోటి దేవతలున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ కొంతమంది దేవతల గురించో మాత్రమే బాగా తెలిసి ఉండటం, మిగతా దేవతల గురించి అంతగా తెలియకపోవటమనేది చాలా సందర్భాల్లో గమనించాను. ఈలోపం వల్లే ముక్కోటి దేవతలెందుకుటా అనే అవగాహనా రాహిత్యంతో మన సంస్కృతినే వెక్కిరిస్తూ కూర్చున్న కొమ్మను నరుక్కునే వారినీ గమనించాను. ఈ పరిస్థితిని చక్క దిద్దడానికి 'ఉడతాభక్తి' గా చేసిన ప్రయత్నమే ఇది. అలాగే తెలిసున్న దేవతల గురించి కూడా తెలియని అంశాలు చాలానే ఉండుంటాయి. అలా తెలియని విషయాలను గురించి ఎంతో కొంత తెలియచెప్పాలన్న ఆలోచ నామనసులో ఉండేది. అప్పుడే అదే లక్ష్యంతో ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం వారు "దైవమ్" శీర్షికను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఆ నిర్ణయానికి చక్కని రూపుదిద్దారు ఆదివారం అనుబంధం డెస్క్ ఇన్చార్జి కరణం జనార్ధనరావు గారు. దాంతో 2016 ఏప్రిల్ నుంచి 2019 మార్చి దాకా ఈ శీర్షిక అత్యధిక పాఠకాదరణతో నడిచింది. ఆదివారం వచ్చిందంటే చాలు నా ఫోన్ కు విరామం ఉండేది కాదు. ఎక్కడెక్కడో మారుమూల పల్లెప్రాంతాల నుంచి ముంబై, చెన్నె, ఢిల్లీ తదితర మహానగరాలు, విదేశాలు, నెట్ ఎడిషన్ పుణ్యమా అని విదేశాల వరకూ దైవం చేరింది. దాంతో రైతు కూలీలు, కులవృత్తులు, చేతిపనులు చేసుకొనే వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద హోదాలలో ఉన్న ఉన్నతాధికారులు, పండితులూ చదివి ఫోన్లు చేస్తూ అభినందిస్తూ వుండే వారు. అంతేకాదు వారికి కావలసిన మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకుంటుండేవారు. అది నాకు ఎంతెంతో ఆనందాన్ని కలిగించిన విషయం. దైవం అచ్చులో వచ్చిన ఆ ఒక్క ఆదివారమే కాదు, మరి కొంతమంది బజ్జీల బండ్ల దగ్గర, వెచ్చాల కొట్ల దగ్గర, స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు అక్కడ ఆదివారం అనుబంధం చూసి దైవమ్ శీర్షికను చదివి బాగుందని ఫోన్ చేసిన సందర్భాలు కూడా కోకొల్లలు. అలాగే వచ్చేవారం దేని గురించి రాస్తున్నారు అని ఆసక్తిగా అడిగేవారు. కొందరైతే మా కోసం ఫలానా దేవుడి గురించి రాయండి అని అడుగుతూండేవారు. శీర్షిక ఆగిన తర్వాత కూడా విరామం లేకుండా ఫోన్లు రావటం తమకు కావలసిన అంశాలను అడిగి తెలుసుకోవటం లాంటివన్నీ పాఠక దేవుళ్ల గుండె గుళ్లల్లో దైవమ్ శీర్షిక ఎంత బాగా పూజలందుకొన్నదనే దానికి ఓ మచ్చుతునక. ఇంకా చెప్పాలంటే ఈ పుస్తకం రూపుదిద్దుకోవటానికి కారణం కూడా చాలా మంది పాఠకుల ఆదరాభిమానాలే. అందుకే పాఠక దేవుళ్లందరికీ మరోమారు నా నమోవాకాలు. పత్రికాయాజమాన్యానికీ, సహకరించాన అందరికీ పేరు పేరునా నమస్సులర్పిస్తున్నాను. నేను అడగగానే దయతో తమ అమూల్య అభిప్రాయాలను రాసి పంపిన పెద్దలకు ప్రణతులర్పిస్తున్నాను. ఈ పుస్తకం త్వరగా వెలుగు చూడాలని తపించిన మిత్రుడు ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ. ఆయన తపస్సును నేను మరువలేను.
ఈ వ్యాసాలను నేను చెపుతూంటే గంటె ఒక చేత, ఘంటం (కలం) ఒక చేత పట్టుకొని రెండిటికీ సమన్యాయం చేసిన నా శ్రీమతి ఇందిరాశేషు శ్రమ అసామాన్యమని నాకు తెలుసు. అచ్చులో వచ్చిన ప్రతిసారీ అవి చదివి దేశవిదేశాల్లోనూ, మారుమూల పల్లెల్లోనూ ఇంకా చెప్పాలంటే టీ దుకాణాలు తదితరాల దగ్గర దైవాన్ని చదివిన వారంతా వ్యాసం కింద ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి అభినందిస్తూంటే ఆ అభినందనలను తాను వింటూ ఆ శ్రమనంతా తాను మరచిపోయిన సంగతినీ నేనెరుగుదును.

You may also like

Search
Home
Shop
Bag
Account