Dictionary of Law and Administration (న్యాయ, పరిపాలనా పదకోశం)
Dictionary of Law and Administration (న్యాయ, పరిపాలనా పదకోశం)
Product details
నివేదన 1947 లో భారతదేశానికి స్వాతంత్యము వచ్చినది. తరువాత పరిపాలనా సంబంధ అన్ని అంశాలలో, ముఖ్యంగా చట్ట సభలు, న్యాయస్థానాలలో అంతవరకు అమలులో గల ఇంగ్లిష్ భాషపైననే ఆధారపడకుండా జాతీయ భాష హిందీలో కూడా నిఘంటువులు అవసరమని నిర్ణయించి, దేశ స్థాయిలో నిఘంటు నిర్మాణాలు ప్రారంభించారు. అదే మార్గంలో తెలుగు రాష్ట్రంలో కూడా ఇంగ్లీష్ - తెలుగు నిఘంటువును రూపొందించారు. భాష నిరంతర ప్రవాహము లాగా సాగుతుంటుంది. పాత మాటలను వదలి, కొత్త పదాలను చేర్చుకుంటూ పోతుంది. ఒకనాడు బాగా ప్రచారంలో గల పదం తరువాతి దశాబ్దాలలో నిషిద్ధ పదం కావచ్చు. సరికొత్త శాస్త్రసాంకేతికలతో సరికొత్త పదాల పుట్టుక అవసరం అయింది. అరుదైన పాత పుస్తకాన్ని సేకరించి ఒక చిన్నబృందంతో దాదాపు ఏడాది శ్రమించాము. నాలుగేళ్ల తరువాత ఇప్పుడు దానిని నవీకరించి 58 వేలకు పైగా పదాలతో డిజిటల్ రూపంలో తీసుకువస్తున్నాము. ఇటీవలనే న్యాయశాస్త్ర పట్టభద్రులైన మనీందర్ కుమార్ (మనం భారతీయులం) మా teluguthejam. com వెబ్ నిర్మాణ నిర్వాహకులు, న్యాయశాస్త్ర పట్టభద్రులు వెన్నుదన్నుగా నిలిచారు. న్యాయశాస్త్ర పట్టభద్రురాలు కుమారి పి.మహతీ సావేరి తమ శక్తి కొలది సహకరించారు. దీనిని ముద్రణకు వీలుగా, వెబ్‌లో చదువుకోవటానికి, దిగుమతికి, యాప్ రూపంలో ఆండ్రాయిడ్, ఐ.ఓ.యస్ (యాపిల్) ఫోనులలో కూడా ఉచిత సాధనంగా రూపొందించగలిగాము. ఇది డిజిటల్ రూపంలో తొలి ప్రయోగం కనుక ఇంకా మెరుగులు దిద్దటానికి అవసరమైన సూచనలు అందించమని న్యాయశాస్త్ర నిపుణులకు, భాషావేత్తలకు, భాషాభిమానులకు మనఃపూర్వక విజ్ఞప్తి.