Gandhi Darshanam - Sri Mandali Venkata Krishnarao
Product details
గాంధీజీ సిద్ధాంతాల ప్రభావం తన మీద చిన్ననాడే ప్రసరించటం వల్ల విద్యార్థి దశనుండి జాతీయ భావాలతో పర ప్రభుత్వ ప్రభావాన్నెదుర్కొంటూ, అనేక ఉద్యమాలలో పాల్గొంటూ, రాజకీయ పాఠశాలల ద్వారా సహచరుల్ని అభివృద్ధి పరుచుకొంటూ, పురోగమించి క్రియాశీలియై ప్రసిద్ధి పొందిన కార్యకర్త శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు.
తన సేవా భావానికీ, గాంధీజీ ఆశయాలకీ కూడ కార్యరూపాన్నివ్వగలిగిన ఒక కేంద్రాన్నేర్పరచి బహుశాఖలతో దాన్ని విస్తరింపజేసిన ప్రజ్ఞావంతుడు శ్రీ మండలి. ఆ కేంద్రమే సేవా వ్యవసాయానికొక క్షేత్రమయింది. అదే గాంధీక్షేత్రం. అది విద్యాభ్యాసానికితోడు సాంకేతిక విద్యలో కూడ శిక్షణ నందిస్తోంది. పుస్తక ప్రచురణ చేస్తోంది- గాంధేయ సమాజ సేవా సంస్థగా. గాంధీక్షేత్రం తన పేరిట ఒక మాసపత్రికను మూడు సంవత్సరాలకు ముందు ప్రారంభించి ఇప్పుడు నాల్గవ సంపుటిని నడుపుతోంది. అందులో శ్రీ మండలివారు వివిధ విషయాలపైన ఇప్పటికి వ్రాసిన వ్యాసాలు ఇరవైకి పైనే ఉన్నాయి. అయితే వాటిలో నుంచి వారు ప్రత్యేకించి గాంధీజీని గురించీ, గాంధీ ఆశయాల్ని గురించీ వ్రాసిన పది వ్యాసాలను గ్రహించి గాంధీ దర్శనం పేరిట ఈ పుస్తకం ప్రచురించటం జరిగింది.