Product details
రాశిలో తక్కువేగానీ, గురజాడ వేంకట అప్పారాయ కవి (1862–1915) ప్రభావం విస్తృతం. తెలుగు సాహిత్యంలోని మూడు ప్రక్రియల్లో - కవిత్వంలో, నాటకంలో, కథా నికలో - ఆయన ఒక పథ నిర్దేశకుడు. తన జీవిత కాలంలోని - అత్యధిక భాగం రాజప్రసాదాల్లో ప్రభువులతో గడుపుతూ, సామాన్యుడు సొంత వ్యక్తిత్వం పొందగలిగే భవిష్యత్సమా జాన్ని గురించి కలలు గన్నారు. నిజానికి, రంగుభేదాలూ, మత భేదాలూ, వర్ణభేదాలూ, కులభేదాలూ లేకుండా, మానవ స్వేచ్ఛ, మానవ సమానత్వం, మానవుల ఆత్మగౌరవం మీద అధారపడ్డ భవిష్వత్ ప్రపంచాన్ని ఆయన దర్శించారు. ఒక కొత్త మానవత కోసం పోరాడిన మహాయోధుడు ఆయన.
Similar products