Product details
కామ్రేడ్ కాళిదాసు
కాళిదాసుగారికి వారి తల్లిదండ్రులు ఏమి ఆలోచించి నామకరణం చేసారో తెలీదు కానీ, తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్న ఆనాటి కాళిదాసు లాంటివారు 1972లో ఈ కాళిదాసు.
అమ్మవారిచేత నాలుకపై బీజాక్షరాలు లిఖించబడి మహాకవి కాళిదాసు అయినాడు ఆనాటి కాళిదాసు. పోపూరి రామారావుగారి, పుతుంబాక వెంకటపతిగారి సాహచర్యంతో 1992 నాటికి ఈ కాళిదాసు 'కామ్రేడ్ కాళిదాసు'గా రూపాంతరం చెందాడు.
ఎన్ని సమస్యలెదురైనా ఎన్ని కష్టాలొచ్చినా నమ్మిన సిద్ధాంతం కొరకు నిలబడడం చాలా కష్టం. అలా నిలబడాలంటే చెక్కుచెదరని నిబద్ధత కావాలి. ఆ నిబద్ధత పరిపూర్ణంగా వున్న వ్యక్తి కాళిదాసు.
కాళిదాసు గురించి మాట్లాడాలంటే వారి భార్య విజయలక్ష్మి గురించి ముందుగా చెప్పుకోవాలి. కాళిదాసు యింత నిబద్ధతతో వున్నాడంటే అది ఆయన భార్య విజయలక్ష్మి సంపూర్ణ సహకారమే కారణం.
నాకు తెలిసి డబ్బు సంపాదించడం కష్టం కాదు. కొన్ని వదిలేస్తే.
కానీ మనుషులను సంపాదించుకోవడం చాలా కష్టం. అది సాధించాడు కాళిదాసు. వసుధైవ కుటుంబం అనే భావన పెంపొందించుకున్నాడు కాబట్టే కాళిదాసు గురించి ఈ పుస్తకం.
కాళిదాసుగారి గురించి మీ అనుభవాలను, జ్ఞాపకాలను, అభిప్రాయాలను తెలుపమని కోరగానే, వ్రాసి పంపిన ఆయా వ్యాస రచయితలందరికీ ధన్యవాదాలు.
డి.టి.పి. చేసిన ఆర్. పరమేశ్వరరావుగారికి, ఓర్పుగా బుక్ డిజైన్ చేసిన పల్లె వెంకటేశ్వర్లుగారికి ధన్యవాదాలు.
ఈ అభినందన సంచికతో కలిపి 'సంస్కృతి' సంస్థ తరఫున ఇప్పటికి 18 గ్రంథాలు వెలువడినాయి. సంస్కృతి గ్రంథమాలికలోని 10 గ్రంథాలకు 'సాహిత్య విద్యార్ధి' మోదుగుల రవికృష్ణ సంపాదకునిగా వ్యవహరించడమేకాక ముద్రణ బాధ్యతను కూడా నిర్వర్తించారు. మిగిలిన గ్రంథాలూ వారి తీర్పుతోనే వెలువడ్డాయి. మోదుగుల రవికృష్ణగారి (MTS ఉపాధ్యాయుడు, లేమల్లెపాడు) తోడ్పాటుకు కృతజ్ఞతలు.
‘కామ్రేడ్ కాళిదాసు' గ్రంథ ప్రచురణకు హార్దికంగా, ఆర్థికంగా తోడ్పడిన నిక్కమైన నాటకాభిమాని డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
Similar products