Product details
గొల్లపూడి మారుతిరావు గారు ప్రతి బుధవారం పత్రికకు ఒక కాలమ్ రాసి మిత్రులకు వినిపించేవారు. అది గురువారం ప్రచురించబడుతుండేది. ఒకరోజు అలా మాట్లాడుకుంటున్నప్పుడు సాహిత్య కృషి గురించి చెపుతున్నప్పుడు కిరణ్‌ప్రభ అనే వారిని గురించి చెప్పసాగారు. ఆయనొక గొప్పవ్యక్తి. కౌముది. కామ్ పేరుతో సాహిత్యసంస్ధను నడుపుతున్నారు. ఆయన తెలుగువాడు. ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లారు. ఆని ఆయన చేస్తున్న కృషి మొత్తాన్ని కూడా ఆయన వివరించటం జరిగింది.
కౌముది డాట్ కామ్ ఆయన సంస్ధ. ఆయన గొప్పగా ప్రసంగాలు తయారుచేసుకుంటారు. ప్రతి వ్యాసాన్ని తన స్వంత గళంతో వినిపిస్తాడు. ప్రతి వ్యాసం ఒక ఉపన్యాసం లాగా చెపుతారు. తర్వాత దాన్ని కౌముది డాట్ కామ్ లో ఉంచుతారు. ఆయన గొల్లపూడి మారుతి రావు గారి ప్రతి మాట అంటే ఆయన రాసిన ప్రతి ఆర్టికల్ ఆయన చదివి అందులో పెట్టారు. అందులో ప్రముఖవ్యక్తుల గురించి చెపుతాడు. కిరణ్‌ప్రభ గారిని తప్పకుండా పరిచయం చేసుకోమని నాకు గట్టిగా సూచించారు.
యస్.వి.యస్. లక్ష్మీనారాయణ
Similar products