Search for products..

Home / Categories / Biography /

కొడాక్ కెమెరా సృష్టికర్త ఆధునిక ఫోటోగ్రఫి పితామహుడు జార్జ్ ఈస్ట్‌మన్ జీవితం

కొడాక్ కెమెరా సృష్టికర్త ఆధునిక ఫోటోగ్రఫి పితామహుడు జార్జ్ ఈస్ట్‌మన్ జీవితం




Product details

ఓ ఔత్సాహికుడు యుక్తవయస్సులో గజిబిజిగా వృత్తిపరమైన హస్తకళను చేపట్టినప్పటికి ఎంతో ప్రేమతో పనులుచేసి దానిని కొత్త ఫొటోగ్రఫిగా సులభతరం చేసి ఆధునిక ఫొటోగ్రఫి పితామహుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఆయనే జార్జ్ ఈస్ట్‌మన్. తాను నమ్మిన పనులను భక్తిస్ఫూర్తితో పూర్తిచేసి అతను జీవించి ఉండగానే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో వారి కృషిని ఉపయోగించుకోవడం చూసి మురిసిపోయాడు. ప్రపంచంలోని ఎవరైనా, ఏ కుటుంబసభ్యులైనా ఒక్క బటన్ నొక్కితే చాలు మధురస్మృతులు తిరిగి వారివద్దకు చేరేవిధంగా రూపొందించాడు. వెబ్‌ప్లేట్ యుగం నుండి ప్రకాశించే వర్తమానం వరకు ఫొటోగ్రపి కమ్యూనికేట్ చేయడానికి, సంఘటనలు పునఃసృష్టించడానికి, జీవితచిత్రాన్ని శాశ్వతంగా రికార్డ్ చేయడానికి ముఖ్యకారకులు జార్జ్ ఈస్ట్‌మన్. ఈరోజు మన పరుగుల జీవితం కదిలే చిత్రంగా ఆధునిక ఫొటోగ్రఫీ ద్వారా అందరి అరచేతిలో ఇమిడిపోయే స్థితికి ఎదిగాం.

ఈరోజు మనం అనుభవించే ఆధునిక పరికరాలకు ఆధ్యుడు జార్జ్ ఈస్ట్‌మన్ గారి జీవితంపై అమెరికాలోని తెలుగు శ్రోతలకు తన రేడియో ప్రసంగం ద్వారా కిరణ్ ప్రభగారి సంభాషణ విన్నాక దీన్ని పుస్తకం రూపంలో ముఖ్యంగా తెలుగు చాయాచిత్రకారలుకు అందించాలనే నా కోరికకు వెంటనే స్పందించి సహకరించి నన్ను నిత్యం ప్రోత్సహించే పితృసమానులు శ్రీ పెద్ది సాంబశివరావుగారికి, శ్రీ విశ్వేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. ఈ ఆధునిక ఫొటోగ్రఫి పితామహుడైన జార్జ్ ఈస్ట్‌మన్ జీవితం గురించి ఫొటోగ్రఫీరంగంలో కొనసాగే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కిరణ్ ప్రభ గారికి తెలుగుఛాయాచిత్రకారులందరి తరఫున అభినందనలు.

మీ శ్రీనివాసరెడ్డి

 


Similar products


Home

Cart

Account