Product details
అది 1960 దశకం. అతని వయసు సుమారు 16 ఏళ్లు. చదువుకునే రోజుల్లోనే అమెరికాలో అల్పసంఖ్యాక వర్గాల (minorities) హక్కులకై ఉద్యమించిన ఉద్యమకారుడు. తర్వాత ఆయనొక డాక్టర్, హిప్పీ, సాంక్రమిక వ్యాధుల శాస్త్రజ్ఞుడు. హిందూ మతాన్ని విశ్వసించిన ఆధ్యాత్మిక వేత్త. మశూచిని, పోలియోను నిర్మూలించటానికి కృషి చేసిన బృందాలలో కీలక పాత్రధారి.
ప్రపంచంలో కంప్యూటర్ ఆవిష్కరణలో అగ్రగామి, అంధత్వ నిర్మూలనకు బృహత్తర కార్యక్రమాలను దశాబ్దాలుగా అమలుచేస్తున్న ఒక వ్యక్తి, ఒక శక్తి, ఇలా ఆయన ఇంకా చాలా, చాలా...
ఈయన అసలు పేరు లారెన్స్ / ల్యారీ బ్రిలియంట్. బ్రిలియంట్ ఇంటిపేరు. బ్రిలియంట్ అంటే నిఘంటు అర్థం మేధావి, ప్రకాశించేవాడు, కాంతులు పంచేవాడు అని చాలా రకాలుగా అన్వయాలు చెప్పుకోవచ్చు. ఆ ఇంటిపేరును సార్ధకం చేసుకొని 76 సంవత్సరాల వయసులో ప్రస్తుతం ప్రశాంతంగా డెట్రాయిట్ లో జీవనం సాగిస్తున్న డాక్టర్ ల్యారీ బ్రిలియంట్ సంక్షిప్త జీవితమే ఈ పుస్తకం.
ల్యారీ గత నాలుగైదు దశాబ్దాలలో శుభప్రభావాలను చూపిన అనేక అంశాలలో కనీసం ఒక్క దానిలోనైనా భాగస్వామి. ల్యారీ సంక్షిప్త జీవితం తెలుసుకుంటే ఉత్కంఠభరిత జీవితం అర్థం అవుతుంది.
Similar products