Mahithatmudu - Sri Mandali Venkata Krishnarao - Raavinuthala Sriramulu
Product details
ఇప్పుడు మండలి కృష్ణారావుగారు లేరు. దివిసీమలో అప్పటి ఉప్పెన తాలూకు గుర్తులూ లేవు. ఆ మహోత్పాతం గురించి ఈ తరం వారికి తెలియదు. అయితే కృష్ణారావు గారి సుకృతం కొద్దీ ఆయన కార్యక్రమాలను ఆయన కుమారుడు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా కీర్తి గడిస్తున్నారు.
శ్రీ రావినూతల శ్రీరాములుగారు సంగ్రహంగా మండలి వారి జీవిత గాథను నేటి తరానికి పరిచయం చేయడం ఎంతో ముదావహం. శ్రీ మండలి వారితో కలిసి పనిచేసిన వారికి వారి మహోన్నత వ్యక్తిత్వం గురించి తెలుసు. శ్రీ రావినూతల శ్రీరాములుగారు వారి చిరు పుస్తకం ద్వారా శ్రీ మండలి వారి గురించి నేటి తరం తెలుసుకుని, వారి సేవా తత్పరతను, త్యాగశీలతను, నైతిక ప్రమాణాలను ఆచరించితే దేశాభ్యుదయానికి పాటుపడినవారు కాగలరు. ప్రత్యేకించి నేటి ప్రజాప్రతినిధులకు శ్రీ మండలి వారి జీవితం ఆదర్శం కావాలి. రచయిత శ్రీ రావినూతల శ్రీరాములు గారికి నా అభినందనలు.