Mandali Venkata Krishnarao Vyasalu-Vupanyasalu
Product details
ఈ పుస్తకం మండలి వెంకటకృష్ణారావుగారి వ్యాసాలు-ఉపన్యాసాల సంకలనం. ఈ వ్యాసాల్లో ఆయన దేశభక్తి, ఆంధ్ర దేశం ప్రజల పట్ల ఆయనకున్న భక్తి గౌరవాలు, ఆంధ్రాభిమానం స్పష్టంగా కనిపిస్తాయి. పంచాయితీ రాజ్ వంటి పాలన వ్యవస్థలు, విద్య, సామాజిక అభివృద్ధి సమస్యలు వంటి విషయాలపై ఆయనకున్న అవగాహన స్పష్టమవుతుంది. రాజకీయ నాయకులలో అరుదుగా కనిపించే రచనా శక్తి ఆయనలో నిండుగా కనిపిస్తుంది.
ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రజలకు ఒక ఆదర్శాన్ని నిరూపించవలసిన ఆవశ్యకత ఉంది. ఈ గ్రంథం అటువంటి ఆదర్శాన్ని నెలకొల్పగలదనీ ప్రజలు తమకు ఎటువంటి రాజకీయ నాయకులు కావాలో నిర్ణయించుకోవడానికి మార్గదర్శకం కాగలదనీ ఆశిస్తున్నాం.
ఎమెస్కో విజయకుమార్