Product details
ఎన్ని సంపాదకీయాలను ఇప్పటికి నేను వ్రాసివుండాలి? కచ్చితంగా లెక్క చెప్పలేను గాని, కనీసం ఆరేడు వేలకుపైగా. వీటిని అచ్చువేస్తే, హీనపక్షం పదిహేను వేల పేజీలకు విస్తరిస్తాయి. ప్రత్యేకవ్యాసాలు, గ్రంథసమీక్షలు, ఇతర రచనలను కలుపుకొంటే, మరొక అయిదు వేల పేజీలకు దేకవచ్చు.
నా సంపాదకీయాలలో అత్యధికభాగం దినపత్రికలలో వెలువడినట్టివే. వాటిని వ్రాసింది దైనందిన సంఘటనలపై, తాత్కాలిక సన్నివేశాలపై, తక్షణ సమస్యలపై. అందువల్ల వాటిలో నూటికి పదివంతులైనా పునర్ముద్రణకు నిశ్చయంగా తగవు.
Similar products