Search for products..

Home / Categories / sahityam /

Narla Samagra Sahityam 4 - నార్లవారి సమగ్ర సాహిత్యం భాగం - 4

Narla Samagra Sahityam 4 - నార్లవారి సమగ్ర సాహిత్యం భాగం - 4




Product details

మనవి
 
ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి దిన పత్రికలలో ఎడిటర్‌గా సుదీర్ఘకాలం పనిచేసి జర్నలిజంలో ఉన్నత విలువలతో ఆ పత్రికలను అగ్రశ్రేణిలో నిలిపిన ఘనత నార్ల వెంకటేశ్వరరావుగారిదే.
ఈ సంపుటంలోని ఐదు గ్రంథాలు అనగా - నేటి రష్యా, స్వదేశ సంస్థానాలు, ఆస్ట్రియా ఆక్రమణ, జెక్ రాజ్య విచ్ఛేదం, పాలస్తీనా 1934-1939 మధ్య రాసినవి ఉన్నాయి. వారు విద్యార్థిగా, నిరుద్యోగిగా, పత్రికలలో చిరుద్యోగిగా ఉన్నప్పుడు రాసినవి. క్రమంగా వారి భాషలో, భావంలో, ఆలోచనా ధోరణిలో మార్పులు వచ్చిన విషయం మీకు తెలుసు. ఈ గ్రంథాలలో ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా యథాతథంగా ముద్రిస్తున్నాం. నార్ల కృషి, స్మృతి, ఛాయాచిత్ర చయనిక ఈ సంపుట అనుబంధాలలో చేర్చాం.
నార్లవారి గ్రంథాలు చిరకాలంగా ముద్రణలో లేవు. వీటిని నార్ల అభిమానులు తరచు కోరుతున్నారు. పైగా మరో ఐదు సంవత్సరాలలో నార్ల శత జయంతి వేడుకలు జరుగనున్నవి. ఈ సందర్భంలో ఆంధ్రాంగ్ల భాషలలో నార్ల రచనలలో అధిక భాగాన్ని పన్నెండు సంపుటాలుగా డాక్టర్ మీనాక్షి నార్ల, డాక్టర్ శరత్ బెల్లప్రవలు వారి కుటుంబ సభ్యుల సాయంతో వెలువరిస్తున్నాం.
ఈ సంపుటాల ప్రచురణ విశేష శ్రమకోర్చి, అందంగా తీర్చి దిద్దేందుకు సహకరించిన నార్లవారి మిత్రులు డాక్టర్ వెలగా వెంకటప్పయ్యగారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సంపుటాన్ని పరిచయం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇనగంటి వెంకట్రావ్ గారికి కృతజ్ఞతలు. అలభ్యంగా ఉన్న రెండు పుస్తకాలను అందించి, పలు రీతుల సహకరించిన లంకా సూర్యనారాయణగారికి, ముద్రణలో సహకరించిన అయినాల మల్లేశ్వరరావు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఈ సంపుటాన్ని పాఠక లోకం సమాదరిస్తుందని మా విశ్వాసం.
గుంటూరు
1 డిశంబరు, 2003

డాక్టర్ కొల్లి శారద
ఛైర్ పర్సన్ - విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి పట్టణాల అభివృద్ధి సంస్థ


Similar products


Home

Cart

Account