Product details
“గ్రామప్రగతి మొదలు విశ్వప్రగతి వరకు పిల్లలే సారథులు. క్రమశిక్షణ గల పిల్లలవల్లే అది సాధ్యం”. సకల చరాచర జగత్తు వికాసానికి సూర్యుడు ప్రాణప్రదాత అన్నట్లు కృష్ణాజిల్లా, గ్రామస్తులు డాక్టర్ నాగులపల్లి భాస్కరరావుగారు గ్రామవికాసంతోనే విశ్వవికాసం సాధ్యమని, దానికి పిల్లలు సారథులు అనడానికి “పిల్లలు పిడుగులు - సిసింద్రీలేనా...?” అనే ఈ పుస్తకం సాక్షీభూతం.
ముదునూరు గ్రామప్రముఖులు, స్వాతంత్ర్య సమరయోధులు కీర్తిశేషులు నాగులపల్లి సీతారామయ్యగారి కుమారులు డా. భాస్కరరావు గారు తన అకుంఠిత దీక్షతో గ్రామాల అంధకారాన్ని పోగొట్టాలని కంకణం కట్టుకున్న భాస్కరుడు. వీరు ప్రభుత్వ సలహాదారులు. దేశ, విదేశాల్లో విద్యను ఆర్జించిన జ్ఞానశిఖామణి, బహు గ్రంథకర్త, సేవాతత్పరులు, ఎన్నో గ్రంథాలయాల స్థాపకులు. క్రమశిక్షణ గల పిల్లలు, పెద్దల చైతన్యంతో సమ సమాజ స్థాపన చేయటం సాధ్యమంటారు.
పిల్లలు పిడుగులు సిసింద్రీ లేనా…!? అనే పుస్తక శీర్షికలో ప్రశ్నార్థకం కనిపిస్తుంది. ఆ ప్రశ్నతో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. ఈనాటి సమాజంలో పిల్లల వ్యక్తిత్వపరంగా మన ఆలోచనలు పరుగులు తీస్తాయి. స్వగ్రామం కేంద్రంగా సాగిన వారి పరిశోధనలో వెలువడిన శోధనలు మనల్ని ఎంతగానో ఆలోచింప చేస్తాయి.
గ్రామాల్లో పిల్లలు భావిపౌరులు ‘కావాలిగా!’ అనడంలో కాస్త నైరాశ్యం, అందులోనే ‘కావాలి’ అనే తపన, ‘ఎలా అవుతారు?’ అనే ప్రశ్న ఉన్నాయి.
డాక్టర్ ప్రసాద్ తోటకూర
Similar products