Product details
1989 దీపావళి నవలల పోటీలో 'పల్లె పిలిచింది' నవలకు ద్వితీయ బహుమతి నిచ్చి సత్కరించిన అభ్యుదయ కాముకులు ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకవర్గానికి బహుమతి నిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీమతి నాయని కృష్ణకుమారి, శ్రీ కేతువిశ్వనాథరెడ్డి గార్లకు.
'పల్లెపిలిచింది' పుస్తక రూపంలో వచ్చేందుకు కారణభూతులు, మిత్రులు శ్రీ వల్లం పాటి వెంకటసుబ్బయ్య గారికి నవలను ప్రచురించిన విశాలాంధ్ర ప్రచురణాలయం - హైదరాబాదు వారికి 1995-96 5 నవలల్లో ఉత్తమ మైనదిగా ఎంపిక చేసి తిరుపతిలో సత్కరించిన 'నూతల పాటి గంగాధరం సాహితీ కుటుంబం తిరుపతి వారికి నవలపై చక్కటి సమీక్షలు ప్రచురించిన 'ఇండియాటుడే', 'ఆంధ్ర భూమి', 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' పత్రికలవారికి -
నవల కొని చదివి ప్రశంసలు కురిపించిన పాఠక మహోదయులకు, ఉపాధ్యాయ మిత్రులకు -
'పల్లెపిలిచింది' తను కొని చదివి, ఇతరులకు కొనిపెట్టి చదివించి, చాలా గొప్పగా ప్రభావితులై, నన్ను వెదకి పట్టుకొని, ద్వితీయముద్రణను చేపట్టి, చక్కని రూపురేఖలతో వెలువరించేందుకు, తనకు తానుగా ముందుకు వచ్చిన సహృదయులు, స్నేహ స్వరూపులు, సాహితీప్రియులు, హైటెక్ ప్రింట్ సిస్టమ్స్ లిమిటెడ్ - హైదరాబాదు సంస్థ అధినేత డి. మధుసూదన్ - May his tribe increase!
నా కథాసంపుటి 'సుఖాలతీరం' ప్రచురణకు కారణభూతులైన చిరంజీవులు శ్రీమతి నారాయణమ్మ - శ్రీ యం. రెడ్డెప్ప నాయుడు (తిరుపతి) గార్లకు
- ఉత్తమ సాహిత్యాభిరుచిగల పాఠకోత్తములందరికీ మనవి - ఈ నవలను కొని చదవండి - కొనిపించి చదివించండి ఆలోచించండి చర్చించండి - కార్యోన్ముఖులు కండి.
Similar products