సదా స్మరామి - డా. కాసరనేని సదాశివరావు
Product details
డాక్టరు గారు వైద్యం ప్రారంభించక ముందే గ్రామీణులకు, పేదవారికి, తక్కువ ఫీజుతో వైద్యం చేయాలనే సంకల్పాన్ని గురించి, విద్యార్థుల వద్ద అసలు ఫీజు తీసుకోకూడదనే నిర్ణయాన్ని గురించి, వైద్యం పేద, ధనిక తేడా లేకుండా, రోగ తీవ్రతే ప్రధానంగా పాటించడం గురించి గొప్పగా స్పందించారు. మరికొందరు, రోగుల పట్ల, వారి సహాయకుల పట్ల డాక్టరు గారి ఆత్మీయ పలకరింపుల గురించి ఆనందాన్ని తెలియపరిచారు. విద్యావంతులు, డాక్టరు గారి దక్షతను గురించి, వారు నిర్వహించిన విద్యాసంస్థల పేరు ప్రఖ్యాతలను గురించి, గొప్పగా బవరించారు. రాష్ట్రం లోని ప్రముఖ సాహితీవేత్తలను, గుంటూరు. రప్పించి సాహిత్యంపై జిజ్ఞాసను రగిలించడం గురించి రాశారు. దేశవిదేశాల్లో వున్న డాక్టర్లు, డాక్టరు గారు ఆనరరీ ప్రొఫెసర్ గా భోదించిన తీరును, నేర్పిన మెళకువలను, ఎస్ప్రెంటీస్ లుగా డాక్టరు గారు, వారి పై చూపించిన ప్రేమ, ఆప్యాయతలను గురించి వ్రాసారు.
"సదా" స్మరామి చదవండి, డాక్టరు గారిని గురించి వివరాలు తెలుసుకోండి.