Menu

Other Authors Books

Other Authors Books

శ్రావణ మాస వ్రత విధానములు - ఇసుకపల్లి రామస్వామి

Quantity

Product details

ముందుమాట

ప్రాతః స్మరణీయులు, పూజ్యులు మామయ్య గారు కీ.శే. శ్రీ ఇసుకపల్లి రామస్వామి గారు, మా అత్తయ్య గారు గం.భా.స శ్రీమతి సావిత్రి గారు తేదీ. 02.08.2002న హనుమకొండ, వరంగల్లు లో మేమందరం ఉండేటప్పుడు, అందునా, నాకు వరలక్ష్మీ వ్రతం చేయించినప్పుడు ఆయన స్వదస్తూరితో వ్రాసి ఇచ్చిన పూజా పుస్తకం ఇది. ఇందులో శ్రావణ మంగళ గౌరీ మరియు వరలక్ష్మీ వ్రతములకు సంబంధించిన పూజా విధానం మంత్ర శ్లోక సహితంగా, చివరలో పాట కథలను కూడా వ్రాసి ఇచ్చారు. పూజా విధానం అంతా ఎంతో చక్కగా, శ్రద్ధగా మా మామయ్య గారు చేయించాక, చివరకు పాట, కథల దగ్గరకు వచ్చేసరికి అత్తయ్య గారు కూర్చుని చేయించేవారు. ఇటువంటి చక్కని, ఉన్నత విలువలు కలిగిన కుటుంబంలోకి నేను అడుగిడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా ప్రియ కుమారుడు, చి. సాయిరాం మనోజ్ వివాహము చి.ల.సౌ. బాల లక్ష్మీ పద్మ సంయుక్త తో 10.11.2024 న, వైభవంగా పెద్దల ఆశీస్సులతో వేదమంత్రాల మధ్య జరిగినది. ఈ మొదటి సంవత్సరం, మా ప్రియమైన కోడలు చి.ల.సౌ. సంయుక్త చేసుకొనబోయే శ్రావణ మంగళ గౌరీ వ్రతం మరియు వరలక్ష్మీ వ్రతములను పురస్కరించుకొని, నాకు మా మామయ్య గారు స్వదస్తూరి తో వ్రాసి ఇచ్చిన ఈ పూజా పుస్తకమును ముద్రణ చేయించి, పదిమందికి ఇచ్చి వారి వారి పూజా కార్యక్రమములలో తద్వారా ఉపయోగపడాలని ఆశిస్తూ, ఆ మంగళగౌరీ దేవి, వరముల నిచ్చే వరలక్ష్మీ దేవి మనందరినీ ఆయురారోగ్యైశ్వర్యాలతో, దీర్ఘ సౌమంగళ్యంతో దీవించాలని, ప్రార్థిస్తూ..
నమస్సులతో


ఇసుకపల్లి వేంకట పద్మజ

You may also like

Search
Home
Shop
Bag
Account