సత్యహరిశ్చంద్ర నాటకము. రచన . బలిజేపల్లి లక్ష్మీకాంతకవి గారు గుంటూరు జిల్లా బాపట్ల పట్టణ సమీపాన గల ఇటికంపాడు లో నరసింహశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ దంపతులకు, 23 డిసెంబరు 1881న జన్మించారు. 30 జూన్ 1953 న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వర్గస్తులయ్యారు. గుంటూరు హిందూ కళాశాలలో చదివారు. లక్ష్మీకాంత కవిగారు స్వాతంత్రసమరయోధులు, నాటక రచయిత,సినీ రచయిత, కవి, అవధాని, నటుడుగా ప్రసిద్ధులు.వీరు1924 లో రాసిన సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకము ఎంతో ప్రఖ్యాతి గాంచినది. నేటికీ ఈ నాటకము జనాదరణతో సాగుతుంది. కర్నూలులో మెట్రిక్యులేషన్ దాకా చదివారు.కొన్నాళ్లు సబ్ రిజిష్ట్రారు కార్యాలయంలో గుమాస్తాగా పనిచేశారు. గుంటూరు హిందూ కళాశాలలో ఉపాధ్యాయునిగా పని చేశారు. అవధానాలు చేయటానికి రాష్ట్రంలోని పలువురు జమీందారుల సంస్ధానాలను సందర్శించారు. చల్లపల్లి రాజా గారి సహాయంతో గుంటూరులో 1922 సం.లో చంద్రికా ముద్రణాలయాన్ని ప్రారంభించారు. ఉప్పు సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొని కారగార వాసం చేశారు. జైలు జీవితం గడుపుతూ సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకం రచించారు. 1926 లో ఫస్ట్ డ్రామా కంపెనీని 1926 లో ప్రారంభించి సత్యహరిశ్చంద్ర, ఉత్తర రాఘవం చాలా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ నాటకాలలో చాలా క్లిష్టమైన పాత్రలను స్వయంగా పోషించారు. ఆయన నటించిన పాత్రల్లో నక్షత్రకుడు ముఖ్యమైనది. చిత్తజల్లు పుల్లయ్య(సి.పుల్లయ్య)గారి ప్రోత్సాహంతో సినిమారంగంలో ప్రవేశించారు. సినిమాలకు మాటలు, పాటలు రచించారు, కొన్నిటిలో నటించారు. 1939లో వీరు తొలుత నటించినది వరవిక్రయం సినిమా. అందులో లింగరాజు పాత్రను పోషించారు. సాహిత్యము 1916 లో శివానందలహరి శతకము. శంకరాచార్యుల రచనకు అనువాదం