Menu

Mandali Venkata krishna Rao

Mandali Venkata krishna Rao

Telugu Basha Katha - Sri Mandali Venkata Krishnarao - Velchuru Narayanarao, Paruchuri Srinivas

Quantity

Product details

కృష్ణారావుగారు అనగానే అంతర్జాతీయ తెలుగు మహాసభలు తప్పనిసరిగా గుర్తొస్తాయి. మలేషియాలో చాలాకాలం క్రితం కూలీలుగా వెళ్లి అక్కడ స్థిరపడి అక్కడి జనంలో కలిసిపోయి పెద్ద ఉద్యోగాల వరకూ ఎదిగిన తెలుగువాళ్లు అప్పటికి తెలుగు భాషమాత్రం బతికించుకుంటూ వాళ్ల ఇళ్లలో తెలుగే మాట్లాడుతుండేవాళ్లని చూసి, వాళ్లు తనని ఆదరించిన సందర్భాన్ని గుర్తుచేసుకుని ప్రపంచంలో అలాగే ఉన్న తెలుగువాళ్లని కలిపి “ప్రపంచతెలుగుమహాసభలు” జరిపిన ఘనత కృష్ణారావుగారిదే. నిరాడంబరంగా, పొదుపుగా జీవించే కృష్ణారావుగారు తనకి దండలు వేయడానికి వచ్చిన వాళ్లని ఆపి ఈదండకి ఎంతఖర్చవుతుంది అని అడిగి, పదిరూపాయిలు అవుతుంది అని విని, అయితే నువ్వు రోజుకు ఎంత సంపాదిస్తావు అని అడిగి మూడురూపాయిలు అని విని, అప్పటినుంచి తనకి దండలు వేయద్దని చెప్పి, ఎక్కడికి వెళ్లినా దండలు వేయించుకోలేదు కృష్ణారావుగారు. గాంధీమార్గంలో నడిచి మాంసాహారాన్ని మానేసి సాత్త్వికమైన జీవితాన్ని జీవించారాయన. ఈ మహానుభావుడిని జ్ఞాపకం చేసుకోవడానికి రాసిన నాలుగు వాక్యాలతో ఈ వ్యాసాన్ని ఆయనకి అంకితం చేస్తున్నాం.

వెల్చేరు నారాయణరావు,

పరుచూరి శ్రీనివాస్

You may also like

Search
Home
Shop
Bag
Account