Vayojana Vidya Vyapthi Mana Kartavyam Mandali Venkata Krishnarao
Product details
శ్రీ మండలి వెంకట కృష్ణారావు ప్రముఖ గాంధేయవాది, జాతీయవాది, అవనిగడ్డలో గాంధీక్షేత్రం అనే మహత్తర సేవాసంస్థను నెలకొల్పి గాంధీజీ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నారు. 1977లో గాంధీజీ 109వ జయంత్యుత్సవాల సందర్భంగా గాంధీక్షేత్రం ద్వారా 109 వయోజన విద్యా కేంద్రాలను వివిధ గ్రామాలలో పెద్దఎత్తున నెలకొల్పి దిగ్విజయంగ నడిపించారు. వయోజన విద్యాశాఖకు అమాత్యులుగా పనిచేసి వయోజన విద్యా కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగ రూపొందించారు. రాష్ట్రస్థాయిలో వయోజనవిద్యా సంఘాన్ని నెలకొల్పారు. సమాజ సేవారంగంలో కాకలు తీరిన యోధుడైన శ్రీ కృష్ణారావుగారు వ్రాసిన ఈ చిరుపొత్తం వయోజనవిద్యా కార్యకర్తలకు కరదీపికగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.
వయోజనవిద్యా కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా రూపొందించి అమలు జరపాల్సి ఉంది. అందులకు ప్రతి పౌరుడు బాధ్యత నిర్వర్తించుటలో ముందుకు రావాలని కోరుతున్నాను.
జై హింద్.